spot_img
spot_img
HomeFilm Newsనిర్మాత కె. అచ్చిరెడ్డి, విద్యార్థి రాజకీయాలు మరియు జై ఆంధ్ర ఉద్యమం.

నిర్మాత కె. అచ్చిరెడ్డి, విద్యార్థి రాజకీయాలు మరియు జై ఆంధ్ర ఉద్యమం.

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి కేవలం సినిమా నిర్మాణంలోనే కాకుండా విద్యార్థి రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల ఆయన చదువుకున్న అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థి దశలో జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నప్పటి ఫోటో వైరల్ అయింది.

అచ్చిరెడ్డికి స్వగ్రామంపై అభిమానం

నిర్మాత కె. అచ్చిరెడ్డికి తన స్వగ్రామంపై ఎంతో అభిమానం. హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ, ఏ మాత్రం అవకాశం ఉన్నా పండగలకు, పబ్బాలకు స్వగ్రామం వెళుతుంటారు.

పూర్వ విద్యార్థుల కలయిక

ఇటీవల ఆయన చదువుకున్న అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం జరిగింది. అత్తిలి షాదీఖానా భవనంలో జరిగిన ఈ వేడుకకు 1971-73 ఇంటర్మీడియట్ బ్యాచ్ విద్యార్థులు 52 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. ఇందులో కొందరు అనారోగ్యంతో కన్నుమూశారు. వారికి నివాళులు అర్పిస్తూ, ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో తమతో చదువుకున్న ప్రముఖ నిర్మాత కొవ్వూరి అచ్చిరెడ్డిని మిత్రులంతా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి చంటి, జెడ్పీ కోఆప్టెడ్ మెంబర్ మహమ్మద్ అబీబుద్దీన్, దిరిశాల ప్రసాద్, చిన్నం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

జై ఆంధ్ర ఉద్యమంలో అచ్చిరెడ్డి

ఈ సందర్భంగా స్టూడెంట్ లీడర్‌గా ఉన్న కె. అచ్చిరెడ్డి అప్పట్లో జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని, నిరాహార దీక్ష చేసిన ఫోటో వైరల్ అయ్యింది.

బ్రహ్మానందం కూడా ఇదే కళాశాలలో చదివారు విశేషం ఏమంటే… ఇదే కాలేజీలో తర్వాతి రోజుల్లో బ్రహ్మానందం లెక్చరర్‌గా పనిచేశారు

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments