
నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు పసిడిని ఒక అజేయమైన ఆర్థిక శక్తిగా మార్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, గ్లోబల్ పెట్టుబడిదారులు ‘బంగారం’ వైపు పరుగులు తీస్తున్నారు. దీనివల్ల పసిడి మార్కెట్ విలువ ఊహించని స్థాయికి చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం మొత్తం విలువ $30 నుంచి $35 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగింది, ఇది భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్ ఉమ్మడి జీడీపీ కంటే మూడు రెట్లు ఎక్కువ.
అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేసిన దాడులు, టెహ్రాన్ ప్రతీకార చర్యలతో గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా అతలాకుతలమయ్యాయి. ఈ అనిశ్చితి పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మళ్లారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర $5,400 నుండి $5,600 వరకు చేరింది. యుద్ధంతో పాటు పోస్ట్-పాండమిక్ ద్రవ్యోల్బణం భయాలు, కేంద్ర బ్యాంకుల భారీ బంగారు నిల్వలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.
ఆర్థిక వ్యవస్థలను మించిన బంగారం, తన విలువతో ప్రపంచానికి ఆకట్టుకుంటోంది. భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ల మార్కుకు చేర్చేందుకు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ సుమారు $3 ట్రిలియన్ల వద్ద ఉంది. కానీ ఎటువంటి ఫ్యాక్టరీలు, కార్మికులు లేని బంగారం, కేవలం భయం మరియు డిమాండ్ కారణంగా రెండు దేశాల ఉమ్మడి జీడీపీని మించిపోయింది. నిపుణులు దీన్ని “ఫైనాన్షియల్ సూపర్ పవర్”గా పిలుస్తున్నారు.
గత 13 ఏళ్లుగా ఒకే పరిధిలో కదులుతున్న బంగారం, ఇప్పుడు భారీ దూకుడుతో ఆ గీతను దాటి ర్యాలీ ప్రదర్శిస్తోంది. 1972–2005లో కనిపించిన తరహా సుదీర్ఘ ర్యాలీ ఇదే అని నిపుణులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ, బంగారం అత్యుత్తమ రాబడులను అందిస్తోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, యుద్ధం పసిడీ పెరుగుదలకు ప్రధాన కారణం. ఒకవేళ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గితే ధరల్లో మార్పు వస్తుంది. అయినప్పటికీ, కేంద్ర బ్యాంకుల ఆసక్తి మరియు కరెన్సీలపై నమ్మకం తగ్గడం వలన పసిడి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని మెజారిటీ నిపుణులు భావిస్తున్నారు.


