
.
నటి ఆనంది నటించిన తాజా చిత్రం ‘శివంగి’ నుండి టీజర్విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించగా, జాన్ విజయ్, డా. కోయ కిశోర్ వంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. ‘శివంగి’ టీజర్ చూస్తే, ఒక సాధారణ గృహిణి జీవితంలో ఒక్క రోజులో జరిగే ఉహించని సంఘటనల నేపథ్యంలో కథ రూపొందినట్లు తెలుస్తోంది. మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్రబృందం చెబుతోంది.
ఆనంది, తమిళ సినీ పరిశ్రమలో ఎక్కువ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. తెలుగులో ఆమె ‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె ‘భైరవం’ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు ‘శివంగి’ ద్వారా మరో ఆసక్తికరమైన పాత్రను ప్రేక్షకులకు అందించనున్నారు.
ఈ సినిమాను దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో నరేష్ బాబు పి నిర్మించారు. మహిళా ప్రాధాన్యత ఉన్న పవర్ఫుల్ కథ కావడంతో, ఇది మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన ఫస్ట్ కాపీ చక్కని స్పందన తెచ్చుకోవడంతో, మేకర్స్ మరింత ఉత్సాహంగా ఉన్నారు. టీజర్ విడుదల తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
టీజర్ ప్రారంభంలో ఒక క్రైమ్ సీన్ చూపిస్తూ, అనేక మిస్టరీ ఎలిమెంట్స్‌ను జోడించారు. ఆనంది పాత్ర బ్యూటీ అండ్ బీస్ట్ మిక్స్‌తో ఉండబోతోందని అర్థమవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్లుగా ఎ.హెచ్. కాషిఫ్, ఎబినేజర్ పాల్ పని చేశారు. సినిమాటోగ్రాఫర్ భరణి కె. ధరన్ అద్భుతమైన విజువల్స్ అందించారు.
ఈ మిస్టరీ థ్రిల్లర్ మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది నటన, విభిన్న కథాంశంతో ‘శివంగి’ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచిచూడాల