spot_img
spot_img
HomePolitical NewsAndhra Pradeshవైసీపీ సమస్య సృష్టించడానికి కుట్ర పన్నుతోంది.కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

వైసీపీ సమస్య సృష్టించడానికి కుట్ర పన్నుతోంది.కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు


శ్రీకాకుళంలో టీడీపీ నేత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఏపీలో శాంతిభద్రతలను దెబ్బతీయడానికి కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అవిశ్వాస వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ నడుచుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ కుట్రలను సహించబోమని, ప్రజల అండతో ప్రభుత్వాన్ని బలంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదివరకు ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్రం దాదాపు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి అహంకారపూరిత పాలన కారణంగా ప్రజలు 2024 ఎన్నికల్లో వైసీపీకి కఠినమైన శిక్ష విధించారని, ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ, వైసీపీ తన ధోరణిలో మార్పు తీసుకురావడం లేదని అన్నారు. ప్రజలు తమను తిరస్కరించినా, ఆ పార్టీ తప్పులను గమనించకుండా అనవసరమైన హంగామాలు చేస్తున్నదని విమర్శించారు.

శ్రీకాకుళంలో జరిగిన కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతి సందర్భంగా రామ్మోహన్ నాయుడు టీడీపీ కార్యకర్తలతో కలిసి నివాళులు అర్పించారు. ఎర్రన్నాయుడు నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేశారని, ఆయన ఆశయాలను కొనసాగించడమే తమ కర్తవ్యం అని నాయుడు అన్నారు. బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా నిలిచిన ఎర్రన్నాయుడు, ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు.

వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, అందుకే ఆ పార్టీ వివాదాస్పద అంశాలను లేవనెత్తి ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జగన్ ప్రజా సమస్యల గురించి కాకుండా తన భద్రత గురించి మాత్రమే ఆందోళన పడుతున్నారని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయడం వైసీపీ పాలనలో పరిపాటి అయిందని ఆరోపించారు. ప్రజలు కూటమి ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిగా స్వాగతిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి పునఃప్రారంభమైందని నాయుడు అన్నారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. మాజీ సీఎం జగన్‌కు ఎన్నికల కోడ్ కూడా తెలియదా? అని ప్రశ్నిస్తూ, ప్రజల మద్దతు లేకుండా ప్రచార రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మను గెలిపించాలని పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపునిచ్చారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments