spot_img
spot_img
HomePolitical NewsNationalటన్నెల్ ఘటన పై మోదీ రేవంత్ రెడ్డికి ఫోన్

టన్నెల్ ఘటన పై మోదీ రేవంత్ రెడ్డికి ఫోన్

నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యమంత్రి గారు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రి గారికి తెలియజేశారు.

సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి వివరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ప్రధానమంత్రి గారికి చెప్పారు.

సహాయక చర్యల కోసం వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపిస్తామని మోదీ గారు ముఖ్యమంత్రి గారికి తెలిపారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రిగారు హామీ ఇచ్చారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు వెంటనే మంత్రులను, అధికారులను అప్రమత్తం చేశారు. ఉదయం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారితో పాటు డీఐజీ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను హుటాహుటిన ప్రమాదస్థలికి పంపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్థానిక అధికారులు, ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్ఆర్డీఎఫ్ బృందాలతో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments