spot_img
spot_img
HomeFilm Newsకింగ్ నాగార్జున 100వ సినిమా ఆచితూచి.కింగ్ నాగార్జున 100వ సినిమా ఆచితూచికింగ్ .

కింగ్ నాగార్జున 100వ సినిమా ఆచితూచి.కింగ్ నాగార్జున 100వ సినిమా ఆచితూచికింగ్ .

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున సోలో హీరోగా తెరపై కనిపించి చాలా కాలమే అవుతోంది. ఇటీవల ‘కూలీ’, ‘కుబేర’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో కనిపించిన నాగ్ నుంచి అభిమానులు మళ్లీ ఒక సాలిడ్ సోలో మూవీని ఆశిస్తున్నారు. ఇప్పటికే 99 సినిమాలు పూర్తి చేసిన నాగార్జున, తన కెరీర్‌లో అత్యంత కీలకమైన 100వ సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మైలురాయి చిత్రాన్ని తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో రూపొందించేందుకు నాగ్ అవకాశం ఇచ్చారు.

ఇంత పెద్ద సెంచరీ మూవీ అయినప్పటికీ ఇప్పటివరకు టైటిల్, పోస్టర్, పూజా వీడియో లేదా కాన్సెప్ట్ వీడియో ఏదీ బయటకు రాలేదు. అయితే అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని నాగార్జున స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లిందని, రామోజీ ఫిల్మ్ సిటీలో టాకీ పార్ట్ షూటింగ్ కూడా జరుగుతోందని తెలిపారు. ఈ చిత్రానికి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇదే సమయంలో మరో ఆసక్తికర విషయం కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో నాగార్జునతో కలిసి టబు నటిస్తున్నట్లు రీసెంట్‌గా కన్ఫర్మ్ చేశారు. చాలా ఏళ్లుగా స్నేహితులమని, తన 100వ సినిమా అని తెలిసి టబు స్వయంగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వాలనుకున్నట్లు నాగ్ వెల్లడించారు. ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండబోతుందన్న వార్తలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

అదనంగా, కర్ణాటకలో పెరిగిన తమిళ అమ్మాయి సుస్మితా భట్ కూడా ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు సమాచారం. నటీనటుల ఎంపికలోనే కాదు, కథ, ట్రీట్మెంట్ విషయంలో కూడా నాగార్జున ఎలాంటి తొందర చూపడం లేదు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయని, అందుకే ఈసారి కొత్తదనం ఉండాలని ఆయన భావిస్తున్నారు.

ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ఆధారిత యాక్షన్ కాకుండా, ప్రేక్షకులు కోరుకునే రియల్ స్టంట్స్‌, సహజమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని నాగ్ స్పష్టం చేశారు. అందుకే 100వ సినిమా విషయంలో ప్రతి అడుగూ ఆచితూచి వేస్తున్నారు. ఇక త్వరలో టైటిల్ అనౌన్స్‌మెంట్ లేదా కాన్సెప్ట్ వీడియో విడుదలైతే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. అప్పటివరకు కింగ్ మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే!

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments