spot_img
spot_img
HomeFilm NewsTFDA ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఘనంగా రక్తదాన శిబిరం

TFDA ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఘనంగా రక్తదాన శిబిరం

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు, TFDA సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

ఈ శిబిరంలో జాతిరత్నాలు సినిమాటోగ్రాఫర్ (DOP), భూమిపుత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సిద్ధం మనోహర్ పాల్గొని రక్తదానం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా TFDA అధ్యక్షుడు వీరశంకర్, కార్యదర్శి సుబ్బారెడ్డి మరియు కమిటీ సభ్యులు సిద్ధం మనోహర్‌ను అభినందించారు. గతంలో భూమిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో TFDA సభ్యుల కోసం అనేక వైద్య శిబిరాలు నిర్వహించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం సిద్ధం మనోహర్ మాట్లాడుతూ, TFDA నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రశంసనీయం అని, భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు సినిమా కార్మికుల సంక్షేమంలో TFDA ముందంజలో ఉందని తెలిపారు. త్వరలోనే TFDA సభ్యులు మరియు ఫిల్మ్ వర్కర్స్ కోసం BHUMIPUTRA FOUNDATIONS వరుసగా వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments