
గన్నవరం టీడీపీ ఆఫీసులో దాడి ముమ్మాటికి టీడీపీ శ్రేణుల పనే. ఆ దాడిలో ఒక దళిత సీఐపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే అతడి తలపగిలింది. సత్యవర్ధన్ అనే వ్యక్తితో అట్రాసిటీ కేసు పోలీసులే బలవంతంగా పెట్టించారు.ఆ విషయాన్ని సత్యవర్ధన్ స్పష్టంగా జడ్జ్ గారి ముందు తెలియజేశాడు.
సత్యవర్ధన్ కోర్టులో నిజం చెప్పాడనే కోపంతో అతడి కుటుంబ సభ్యులను కొంతమంది పసుపు పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేశారు. రాష్ట్రంలో రాతియుగం నాటి పాలన సాగుతోంది. చట్టం అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదు.
కొందరు పోలీసులను, బలగాలను అడ్డు పెట్టుకుని TDP పార్టీ పాలకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు అని జూపూడి ప్రభాకర్ గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి మీడియా సమావేశం లో ఆరోపించారు.