
మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చారిత్రక సినిమా డేవిడ్ రెడ్డి గురించి అంచనాలు భారీగా ఉన్నాయి. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోటుకూరి భరత్ మరియు నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. గత కొన్ని నెలలుగా సినిమా ప్రకటనలు మిద్దుగా ఉండడం మనోజ్ మిరాయ్ ప్రాజెక్ట్ బిజీ షెడ్యూల్ కారణంగా కొంచెం ఆలస్యమైంది. ఎప్పటిలాగే విభిన్నమైన, సరికొత్త కథలను ఎంచుకునే మనోజ్ ఈసారి కూడా ప్రేక్షకులను ఆకట్టేలా ఒక ప్రత్యేక కథను ఎంచుకున్నారు.
డేవిడ్ రెడ్డి కథ 1897-1922 మధ్యకాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించిన, ఢిల్లీలో పెరిగి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన డేవిడ్ రెడ్డి జీవితంపై ఆధారపడి ఉంటుంది. మేకర్స్ తెలిపిన ప్రకారం, డేవిడ్ రెడ్డి స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన ఒక వ్యక్తి. తాజాగా విడుదలైన “వార్ డాగ్” గ్లింప్స్ ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఈ గ్లింప్స్‌లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అతని విధానం, అలాగే భారతీయుల కష్టం, ద్వేషాలు ఎలా ఎదుర్కొన్నారో చూపించారు.
వార్ డాగ్ అనేది సినిమా లోని ప్రత్యేక బైక్ పేరు. ఆ బైక్ ద్వారా చిన్న పిల్లవాడు తండ్రి గాథను విన్నట్లు చూపిస్తూ, డేవిడ్ రెడ్డి కథను వాయిస్ ఓవర్ ద్వారా వివరించారు. జలియన్ వాలా బాగ్, మొదటి ప్రపంచ యుద్ధం వంటి సంఘటనల నేపథ్యంతో, అతను ఎందుకు వార్ డాగ్ గా ప్రసిద్ధి చెందారో వివరించారు. బ్రిటీష్ మరియు కొంతమంది భారతీయుల ద్వేషాన్ని ఎదుర్కొన్నప్పటికీ, అతను ఒక్కడుగా న్యాయమార్గంలో ఎదిరించడాన్ని హైలైట్ చేశారు.
గ్లింప్స్ చివర్లో మనోజ్ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. బ్రిటీష్ ఇండియా కాదు, డేవిడ్ రెడ్డి ఇండియా అని హిందీలో చెప్పడం ఒక ముఖ్య హైలైట్. ఈ సినిమాలో మనోజ్ నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
సంగీతం రంగంలో రవి బసూర్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కెజిఎఫ్ లాంటి హై లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులను మైండ్ బ్లో చేస్తుంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. షూటింగ్ పూర్తి కాకపోయినా, డేవిడ్ రెడ్డి సినిమా ద్వారా మనోజ్ మరో విజయం సాధిస్తాడా అనే ఉత్సాహం ఫ్యాన్స్ మధ్య ఉధ్రిక్తంగా ఉంది.


