spot_img
spot_img
HomeFilm NewsKollywoodకమల్ హాసన్ 'హే రామ్' ఎందుకు ఫ్లాప్ అయింది?

కమల్ హాసన్ ‘హే రామ్’ ఎందుకు ఫ్లాప్ అయింది?

ఎవరి పిల్లలైనా వారికి ముద్దుగానే ఉంటారు. ఎంత గొప్పగా మాట్లాడినా, కొంతమంది తమ పిల్లల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు మరియు ఇతరులను తక్కువగా చూస్తారు. పాతికేళ్ల క్రితం నటుడు, నిర్మాత మరియు దర్శకుడు కమల్ హాసన్ కూడా ఇలాగే ప్రవర్తించారు.

కమల్ హాసన్ తన స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో మరియు నటనలో రూపొందిన ‘హే రామ్’ సినిమాను ఆత్మ కలిగిన కథగా అభివర్ణించారు. అంతేకాకుండా, సర్ రిచర్డ్ అటెన్‌బరో రూపొందించిన ‘గాంధీ’ (1982) చిత్రాన్ని ఒక పరదేశీయుడు తీసిన ‘ట్రావెల్ మూవీ’గానే పరిగణించాలని ఆయన అన్నారు. తన ‘హే రామ్’లోనే ఎక్కువ ఆత్మ ఉందని కమల్ గొప్పగా చెప్పుకున్నారు.

అయితే, 2000 ఫిబ్రవరి 18న విడుదలైన ‘హే రామ్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా కమర్షియల్‌గా దెబ్బతిన్నా, విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. భారత ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీకి అధికారికంగా పంపింది. కానీ, ఆ సినిమాకు ఆస్కార్ నామినేషన్ లభించలేదు. కమల్ తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా రిచర్డ్ అటెన్‌బరో సినిమాను తక్కువ చేసి మాట్లాడినా, ఆ తర్వాత రోజుల్లో ‘గాంధీ’ మేకింగ్ విలువలను మెచ్చుకున్నారు.

అంతేకాదు, ‘హే రామ్’ సినిమాలో ‘గాంధీ’లో టైటిల్ రోల్ పోషించిన బెన్ కింగ్‌స్లీని మళ్లీ గాంధీజీగా నటింపజేయాలని కమల్ ఆశించారు. ‘గాంధీ’లో బెన్ ఎంత గొప్పగా నటించకపోతే, ఆ పాత్రకు మళ్లీ ఆయననే ఎంచుకోవాలని కమల్ ఎందుకు తపిస్తారో చెప్పండి. అంతలా బెన్ కింగ్‌స్లీ నుండి నటన రాబట్టుకున్న అటెన్‌బరోను తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదని విమర్శలు వినిపించాయి. బెన్ మళ్లీ ‘గాంధీ’లో లాగా గాంధీజీ పాత్రలో నటించలేనని చెప్పేశారు.

దాంతో అప్పటికే ఒక నాటకంలో గాంధీగా నటించిన నజీరుద్దీన్ షాను కమల్ సంప్రదించారు. ఆయన కూడా ఆ మేకప్ కోసం చాలా సమయం కేటాయించవలసి ఉంటుందని చెప్పి నిరాకరించారు. అయితే కమల్ అభ్యర్థన మేరకు చివరకు నజీరుద్దీన్ అంగీకరించారు. ఏమైతేనేమి, ‘గాంధీ’కి ఘనవిజయం సాధించి పెట్టిన జనం ‘హే రామ్’ను మాత్రం ఆదరించలేకపోయారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments