
జస్ప్రీత్ జైసా కోయ్ నహీ!
టీఎన్టీ లాంటి పేస్, అచ్చొచ్చిన లైన్–లెంగ్త్, బుమ్రా బౌలింగ్‌కి ఉన్న మ్యాజిక్‌ని ప్రపంచ క్రికెట్ మళ్లీ మళ్లీ చూసి ఆశ్చర్యపోతూనే ఉంది. టీ20ల్లో ప్రత్యేకంగా ఆస్ట్రేలియా వంటి దూకుడు జట్టుపై అతను చూపించే ఆధిపత్యం అసాధారణం. ఇప్పుడు ఆ రికార్డు పుస్తకంలో మరో బంగారు అక్షరం చేరేందుకు జస్ప్రీత్ బుమ్రా కేవలం ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియాపై టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచే ఈ అరుదైన అవకాశం బుమ్రా ఎదుట నిలబడి ఉంది. ఇప్పటికే పవర్‌ప్లేలోనూ, డెత్ ఓవర్లలోనూ తన అద్భుత నైపుణ్యాన్ని నిరూపించిన బుమ్రా, ఇప్పుడు ఈ రికార్డును అందుకోవడం కేవలం సమయ సమస్య మాత్రమే అనిపిస్తోంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అతని యార్కర్లను ఎదుర్కొనడం ఎంత కష్టమో ప్రపంచమంతా తెలుసు. అందుకే బుమ్రా ప్రతి ఓవర్ కూడా ఒక మ్యాచ్‌ను మార్చే శక్తిని కలిగి ఉంటుంది.
గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగబోయే నాల్గవ టీ20 మ్యాచ్‌లో భారత్ సిరీస్ ఆధిక్యాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయంటే, అందులో బుమ్రా పాత్ర కీలకం. ప్రారంభ వికెట్లు తీసినా, చివరి ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసినా—అతని ప్రభావం మ్యాచ్‌లో స్పష్టంగానే కనిపిస్తుంది. భారత బౌలింగ్ దళానికి దిక్సూచి లాంటి బుమ్రా, యువ బౌలర్లకు కూడా మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో అతను ఒక్క వికెట్ తీస్తే చాలు — రికార్డుబుక్లో కొత్త చరిత్ర నమోదు కానుంది. బుమ్రా ఇప్పటికే ప్రపంచంలోని ఉత్తమ పేసర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు, ఇప్పుడు ఆ గుర్తింపును మరో మెట్టుపైకి తీసుకెళ్లే అవకాశం ఇది.
AUSvIND నాల్గవ టీ20 మ్యాచ్ నవంబర్ 6న మధ్యాహ్నం 12:30 గంటలకు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.భారత అభిమానులంతా ఒకటే కోరుకుంటున్నారు —బుమ్రా మరోసారి తన మ్యాజిక్ చూపించాలి… ఇంకా ఆ రికార్డు మనదే కావాలి!


