
అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) మళ్లీ ఫుల్ స్పీడ్‌లో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. గతంలో వరుస ఫ్లాప్‌లతో ఐరన్ లెగ్ అనే ట్యాగ్‌ను మోస్తూ వచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఆ పేరు నుంచి బయటపడటానికి బాగా శ్రమిస్తోంది. ఇటీవల ఆమె నటించిన రెట్రో స్టైల్ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోయినా, పూజా వెనుకడుగు వేయలేదు. తనకు మరో మంచి బ్రేక్ రావాలనే ఉద్దేశ్యంతో కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది.
ఇటీవల కూలీ సినిమాలోని మోనికా సాంగ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజా, తన అందం, డ్యాన్స్ స్కిల్స్‌తో మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక ప్రస్తుతం ఆమె విజయ్ సరసన నటిస్తున్న జన నాయకుడు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, పూజా మరో సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో కూడ కొత్త సినిమా సైన్ చేసింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
ఈ రెండు ప్రాజెక్టుల తరువాత కూడా పూజా హెగ్డేకు మరో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న కాంచన 4 సినిమాలో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషించబోతోందని సమాచారం. ఈ సినిమాతో పూజా మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఇక తాజా సమాచారం ప్రకారం, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో కూడ పూజా జోడీ కట్టబోతోందట. వరుస విజయాలతో దూసుకుపోతున్న ధనుష్ ప్రస్తుతం తన 55వ చిత్రాన్ని రూపొందిస్తుండగా, అమరన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే పూజా హెగ్డే వరుసగా పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంది. ఈసారి ఈ బుట్టబొమ్మ తన అదృష్టాన్ని మళ్లీ మెరిపిస్తుందా లేదా అనేది చూడాలి. అభిమానులు మాత్రం ఆమెకు హిట్ కావాలని కోరుకుంటున్నారు.


