
‘సంతాన ప్రాప్తిరస్తు’ విడుదలకు ముందే చాందినీ చౌదరి నటిస్తున్న మరో చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. ఈసారి ఆమె ఓ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా చాందినీ కెరీర్లో మరో ప్రయోగాత్మక పాత్రగా నిలిచే అవకాశం ఉందని చిత్రబృందం చెబుతోంది. ‘కలర్ ఫోటో’ ద్వారా తన నటనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చాందినీ, ఇప్పుడు విభిన్నమైన కథల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
‘సంతాన ప్రాప్తిరస్తు’ నవంబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉండగా, ఆదివారం ఫిల్మ్‌నగర్ దేవాలయంలో చాందినీ కొత్త సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొదటి క్లాప్ ఇచ్చారు. సుశాంత్ యాష్కీ హీరోగా, చాందినీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వికాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.
సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై సృజన్ గోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, “సహచారి ప్రొడక్షన్ 2 ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ చిత్ర కథ వినిపించారు, చాలా యూనిక్‌గా ఉంది. ఇలాంటి ప్రయోగాత్మక కథలు తెలుగు ఇండస్ట్రీకి అవసరం” అని అన్నారు. ఆయన టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాత సృజన్ గోపాల్ మాట్లాడుతూ, “ఈ సినిమాతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. సైన్స్ ఫిక్షన్‌తోపాటు డార్క్ కామెడీని మిళితం చేస్తున్నాం. ఇందులో ఒక సూపర్ హీరో కాన్సెప్ట్‌తో పాటు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కాన్సెప్ట్ వీడియోను త్వరలో విడుదల చేస్తాం” అని తెలిపారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ చివర్లో ప్రారంభం కానుంది. జీవన్ కుమార్, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందించగా, జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. చాందినీ చౌదరి ఈ సినిమా ద్వారా మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందనే అంచనాలు ఉన్నాయి.


