
‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో బాలిరెడ్డిగా నెగటివ్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన నటుడు నవీన్ చంద్ర, ఇప్పుడు మరోసారి పవర్‌ఫుల్ విలన్ పాత్రతో తెరపై కనిపించబోతున్నారు. తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, గంభీరమైన నటనతో ఇప్పటికే సినీప్రియుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఆయన, మళ్లీ అదే ఇంటెన్సిటీతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.
రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో నవీన్ చంద్ర వాయిస్ ఓవర్‌తోనే ప్రారంభమవ్వడం ఆయన పాత్ర ప్రాధాన్యతను సూచిస్తుంది. “కేజీ రెండు కేజీలు కాదురా! 20 టన్నులు. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్‌లో ఎక్కించండి!” అనే డైలాగ్‌తో ఆయన గంభీరమైన స్వరం ట్రైలర్ మొత్తానికి మరో లెవెల్‌ని ఇచ్చింది.
ట్రైలర్‌లో ఆయన కనిపించిన ప్రతి సీన్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసేలా ఉంది. జుట్టు, గడ్డం, దుస్తులు అన్నీ ఆయన పాత్రలోని రఫ్ అండ్ టఫ్ నెస్‌ని చూపిస్తున్నాయి. ఒక డైలాగ్ — “ప్రతి కరిపోలమ్మ జాతరకి శత్రువుల్ని బలివ్వడం నా ఆనవాయితీ!” — వింటేనే ఆయన పాత్ర ఎంత ఇంటెన్స్‌గా ఉందో అర్థమవుతుంది. ఆయన అభినయం ప్రతి ఫ్రేమ్‌లో శక్తిని పంచుతోంది.
నవీన్ చంద్ర గత చిత్రాల్లాగే ఈ సినిమాలో కూడా తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేస్తారని అభిమానులు విశ్వసిస్తున్నారు. విలన్‌గా ఆయన తెరపై కనిపించినప్పుడు ఆ సీన్లు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈసారి ఆయన పాత్ర కేవలం ప్రతినాయకుడిగా కాకుండా కథను నడిపించే ప్రధాన శక్తిగా కనిపిస్తోంది.
‘మాస్ జాతర’ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌నే చూసి ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు. నవీన్ చంద్ర పవర్‌ఫుల్ రోల్‌తో ఈసారి కూడా తన ప్రతిభను మరోసారి నిరూపించబోతున్నాడు.


