spot_img
spot_img
HomeFilm Newsమాస్ అండ్ లవ్ కలిపిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా సౌర్యం 17 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా...

మాస్ అండ్ లవ్ కలిపిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా సౌర్యం 17 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా సంబరాలు!

మాస్ యాక్షన్‌కు రొమాంటిక్ టచ్‌ను జోడించి ప్రేక్షకులను అలరించిన చిత్రం సౌర్యం. మాచో స్టార్ గోపిచంద్, టాలెంటెడ్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం, విడుదలై నేటికి 17 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు, సినీప్రియులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా సంబరాలు జరుపుకుంటున్నారు.

2008లో విడుదలైన సౌర్యంను ప్రముఖ దర్శకుడు శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గోపిచంద్ స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులలో ఎనర్జీని నింపాయి. అనుష్క శెట్టి తన అందం, నటనతో సినిమాకి రొమాంటిక్ టచ్‌ని తీసుకువచ్చింది. ఇద్దరి కెమిస్ట్రీ సినిమా హైలైట్‌గా నిలిచింది.

అలాగే ఈ చిత్రంలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సౌర్యంను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. పాటలతో పాటు స్టంట్ సీన్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్‌కు పండగలా మారింది.

సౌర్యం గోపిచంద్ కెరీర్‌లో మైలురాయి అయిన సినిమా. ఈ సినిమా ద్వారా ఆయనకు ‘మాచో స్టార్’ అనే ఇమేజ్ మరింత బలపడింది. అనుష్క శెట్టి కూడా ఈ సినిమాతో తన అభిమాన వర్గాన్ని విస్తరించుకుంది. సినిమా విజయంతో దర్శకుడు శివకు కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

17 ఏళ్లు గడిచినా సౌర్యం సినిమా ఇంకా ప్రేక్షకుల మదిలో నిలిచే క్లాసిక్ మాస్-రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా మిగిలింది. గోపిచంద్, అనుష్క జంట రసవత్తరమైన ప్రేమకథతో పాటు పవర్‌ఫుల్ యాక్షన్‌ని అందించిన ఈ చిత్రం, టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సాధించింది. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో 17YearsForSouryam హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్స్ క్రియేట్ చేస్తూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments