spot_img
spot_img
HomePolitical Newsఇస్మాయిలీ ముస్లింల వారసుడికి సంతాపం తెలిపిన తెలంగాణ CM

ఇస్మాయిలీ ముస్లింల వారసుడికి సంతాపం తెలిపిన తెలంగాణ CM

మానవతావాది, పద్మవిభూషణ్‌ గ్రహీత, అగాఖాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆగా ఖాన్‌‌ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు సంతాపం ప్రకటించారు. ఇస్మాయిలీ ముస్లింల వారసుడిగా ఆధ్యాత్మిక గురువుగా నియమితులైన కరీం అల్-హుస్సేనీ ఆగా ఖాన్ IV గారి మరణం మానవాళికి తీరని లోటు అని ముఖ్యమంత్రి గారు అన్నారు.

గొప్ప మానవతావాదిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును అందుకున్నారని అన్నారు. ఆగాఖాన్ నెట్ వర్క్ ద్వారా వివిధ దేశాల్లో ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి మానవాళికి తన సేవలను అందించారని గుర్తు చేశారు. పేదరిక నిర్ములన, వారసత్వ సంపద పరిరక్షణకు, వైద్య సేవలు, విద్యా రంగంలో ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని, హైదరాబాద్ కేంద్రంగా ఆగా ఖాన్ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో గొప్పవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

ఆయన జీవితాంతం మానవ జాతి గౌరవం పెంచే ఉన్నత విలువలను ఆచరించారని కొనియాడారు. వారి వారసులకు, కుటుంబసభ్యులకు, అనుచరులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments