
ఇండస్ట్రీలో కొన్ని జంటలు ఎప్పటికీ ప్రత్యేకం. వారి కెమిస్ట్రీ రీల్లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాంటి జంటల్లో ప్రభాస్, అనుష్క ఒకరు. బిల్లా సినిమా సమయంలో మొదలైన వారి పరిచయం, తరువాత మిర్చి, బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో మరింత బలమైన స్నేహంగా మారింది. అప్పటినుంచి వీరికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ప్రభాస్, అనుష్క ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎప్పుడూ చర్చనీయాంశం. అభిమానులు వారిద్దరినీ పెళ్లి చేసుకుంటే బావుండు అనుకుంటూ సోషల్ మీడియాలో పుకార్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కానీ ఇద్దరూ ఎప్పుడూ “మేము మంచి స్నేహితులం” అని క్లారిటీ ఇచ్చారు. బాహుబలి 2 తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించకపోవడంతో, ఫ్యాన్స్ చాలా కాలంగా వీరిని మళ్లీ స్క్రీన్ పై జంటగా చూడాలని కోరుకుంటున్నారు.
ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోందని టాక్. అక్టోబర్ 31న బాహుబలి రెండు పార్ట్స్‌ను కలిపి, కొత్తగా కొన్ని సీన్స్ యాడ్ చేసి “బాహుబలి ది ఎపిక్“ పేరుతో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ-రిలీజ్ ప్రమోషన్స్ కోసం ప్రభాస్, అనుష్క కలిసి స్టేజీ పై కనిపించబోతున్నారని సమాచారం. దీంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.
రాజమౌళి కూడా ఈ రీ-రిలీజ్ ప్రమోషన్స్ కోసం స్పెషల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్, రానాతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ షూట్ చేయగా, అనుష్కను కూడా ప్రమోషన్లలో భాగం చేయాలని నిర్ణయించారని టాక్. దీంతో మళ్లీ చాలా కాలం తర్వాత అన్నావదిన జంట స్టేజ్ పైన దర్శనమివ్వబోతున్నారు.
ఎన్నాళ్లుగానో అభిమానులు ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ తిరిగి కలవడం సినీప్రియులకు సంబరాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పటికే #PrabhasAnushka ట్రెండ్ అవుతూ, “మళ్లీ జంటగా చూడబోతున్నాం” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.


