
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల్లో పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, తన నటనా ప్రతిభతో నాని తిరిగి నిలబడ్డాడు. టైర్ 2 హీరోల నుంచి టైర్ 1 హీరోగా మారిపోయిన నాని, తన ప్రతి సినిమాలోని విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజా చిత్రం “ది ప్యారడైజ్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
“ది ప్యారడైజ్” నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. “కాకుల కథ” అనే డైలాగ్ ఇప్పటికీ అందరిని ఆకట్టుకుంటోంది. దసరా సినిమాలో తన నటనా విశ్వరూపాన్ని చూపించిన నాని, ఈ సినిమాలో మరో మారు తన అద్భుత ప్రతిభను చూపించనున్నాడు. ఈ సినిమా కోసం నాని ఎంతగా కష్టపడుతున్నాడో ఆయన లుక్ చూస్తే అర్థమవుతుంది.
ఇటీవల నాని మీడియా ముందు ప్రత్యక్షమవగా, ఆయన గెటప్ ఫ్యాన్స్‌కి మైండ్ బ్లో అయ్యేలా చేసింది. గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో రగ్గడ్ లుక్‌లో కనిపించిన నాని, ఈ సినిమాకు ప్రత్యేకమైన లుక్‌ను సిద్దం చేశాడు. ప్యారడైజ్‌లో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే క్లీన్ షేవ్ లుక్ బయటకు రాగా, రెండో లుక్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, దసరా తర్వాత నాని కెరీర్‌కు మరో మైలురాయిగా నిలవనుందని అంచనా. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండగా, నాని అభిమానులు భారీ అంచనాల మధ్య ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. “ప్యారడైజ్” ద్వారా నాని మరో బ్లాక్‌బస్టర్ అందుకోవడం ఖాయం అనే నమ్మకం అభిమానులలో ఉంది.


