
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ఎన్నో సంవత్సరాలుగా ఒక బిగ్ హిట్ కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. తన కెరీర్లో స్థిరమైన విజయాలు లేకపోయినప్పటికీ, తన పోరాట స్ఫూర్తిని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ప్రేక్షకులను మెప్పించేందుకు కొత్త కథలు, వైవిధ్యమైన పాత్రలతో కూడిన సినిమాలను ఎంచుకుంటూ, విజయాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య గోపీచంద్ ఓ కొత్త సినిమాను ప్రకటించాడు. ఘాజీ, ఐబీ 71 వంటి సీరియస్ కాన్సెప్ట్ సినిమాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
ఈ చిత్రం “గోపీచంద్ 33″గా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం గోపీచంద్ అభిమానుల్లో నూతన ఆసక్తిని రేకెత్తించింది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. పోస్టర్ చూస్తే గోపీచంద్ ఓ యోధుడిగా 7వ శతాబ్దానికి సంబంధించిన కథలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి “శూల” అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. శూల అనేది కథలో ప్రధానమైన ప్రదేశం పేరు అని, ఆ టైటిల్ కథకు ఎంతో సరిపోతుందని యూనిట్ భావిస్తోంది. ఇది కొత్తగా ఉండటంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి కలిగే అవకాశముంది. త్వరలోనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
గోపీచంద్ లుక్, సినిమాకి వచ్చిన హైప్ బట్టి చూస్తే ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఈసారి అయినా గోపీచంద్‌కు విజయాన్ని అందించగలదేమో అని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ సినిమా హిట్ అయితే గోపీచంద్ కెరీర్లో మైలురాయిగా నిలవనుంది.


