spot_img
spot_img
HomeFilm Newsహెబ్బా పటేల్ నటించిన ‘థాంక్యూ డియర్’ టీజర్ విడుదలై మంచి స్పందన పొందుతోంది.

హెబ్బా పటేల్ నటించిన ‘థాంక్యూ డియర్’ టీజర్ విడుదలై మంచి స్పందన పొందుతోంది.

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం థ్యాంక్యూ డియర్. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు తోట శ్రీకాంత్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఇందులో ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ విడుదల చేశారు. టీజర్‌లో ప్రేమ, భావోద్వేగాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితమైనదిగా కనిపించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. థ్యాంక్యూ డియర్ టీజర్ మంచి స్పందనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీజర్ రిలీజ్ కార్యక్రమంలో వివి వినాయక్ మాట్లాడుతూ, “రియల్ స్టార్ శ్రీహరి గారి కుటుంబానికి చెందిన ధనుష్ రఘుముద్రి ఈ చిత్రంతో హీరోగా నటిస్తున్నాడు. శ్రీహరి గారి ఆశీర్వాదాలతో ధనుష్ తన తండ్రి లానే ప్రేక్షకుల మన్ననలు పొందాలని ఆశిస్తున్నాను,” అని చెప్పారు. అలాగే సినిమా కథలో మంచి మెసేజ్ ఉండటం గమనార్హమని అన్నారు.

హెబ్బా పటేల్ ఈ సినిమాలో తనకు ప్రత్యేకమైన పాత్ర లభించిందని చెప్పింది. తాను ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే ఇది చాలా భిన్నంగా ఉండనుందని వెల్లడించింది. రేఖా నిరోషా కూడా కుటుంబ కేంద్రంగా నడిచే ఈ కథలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు.

ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. భావోద్వేగాలు, ప్రేమ, కుటుంబ విలువలతో మిళితమైన ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments