
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 2 నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ఈ కాలంలో ఆయన ఐదు దేశాలను సందర్శించనున్నారు. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సు ఆయన పర్యటనలో ప్రధానాంశంగా నిలవనుంది. బ్రిక్స్ సమావేశం తర్వాత మోదీ ఇతర దేశాల్లోనూ పర్యటించనున్నారు.
మొదటగా ప్రధాని జూలై 2, 3వ తేదీల్లో ఆఫ్రికా ఖండంలోని ఘనా దేశానికి వెళ్తారు. ఇది మోదీకి ఘనాలో తొలి పర్యటన కాగా, సుమారు మూడు దశాబ్దాల తర్వాత భారత్ ప్రధాన మంత్రి ఆ దేశాన్ని సందర్శించనుండడం విశేషం. ఘనాలో అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అక్కడి నుంచి మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్లనున్నారు. జూలై 3, 4 తేదీల్లో ఈ దేశంలో ఆయన పర్యటిస్తారు.
తరువాత అర్జెంటీనాలో జూలై 4, 5 తేదీల్లో ప్రధాని పర్యటించనున్నారు. అక్కడి ప్రభుత్వంతో వాణిజ్యం, విద్య, విజ్ఞానం, ఇంధన రంగాల్లో ఒప్పందాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. జూలై 5 నుంచి 8 వరకు మోదీ బ్రెజిల్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. ఇది ఆయనకు బ్రిక్స్ లో భాగంగా మరో కీలక పర్యటన అవుతుంది.
చివరిగా జూలై 8న ప్రధాని నమీబియా చేరుకుంటారు. నమీబియాలో పర్యటించిన మూడో భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. నమీబియాతో సహకారం ద్వారా వాణిజ్య, విద్య, ఆరోగ్య రంగాల్లో ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానంలో మరో కీలక అడుగు. ఇప్పటికే ఆయన అనేక దేశాల్లో పర్యటించి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచారు. తహవూర్ రాణా లాంటి ఉగ్రవాదులను భారత్‌కు తీసుకొచ్చే చర్యలే కాదు, భవిష్యత్తులో మోహుల్ చోక్సీ, నీరవ్ మోడీ వంటి దోపిడీదారులను రప్పించేందుకు కూడా ఈ పర్య


