
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “కూలీ“ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజినీతో పాటు ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్ లాంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్‌గా శృతి హాసన్ కనిపించనుండగా, ఆమె పాత్ర కూడా చాలా ముఖ్యమైనదిగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానుల్లో విశేష ఉత్సాహాన్ని రేపాయి.
ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో, మేకర్స్ ప్రమోషన్లు జోరుగా మొదలుపెట్టారు. తాజాగా విడుదలైన ప్రమోషనల్ మ్యూజిక్ వీడియో “చికిటు” పేరిట రిలీజ్ అయింది. ఈ పాట విడుదలవుతూనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పాటలో రజినీకాంత్ ప్రత్యేకమైన డాన్స్ స్టెప్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుండగా, అనిరుధ్ అందించిన సంగీతం మరోసారి మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించింది.
అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే “జైలర్” సినిమాతో తన టాలెంట్‌ను నిరూపించగా, ఇప్పుడు “కూలీ” చిత్రంతో మళ్లీ తన మార్క్‌ను చూపించాడు. “చికిటు” పాటలో టి. రాజేందర్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం, పాటకు మరో హైప్‌ను తెచ్చింది. ఈ సాంగ్‌లోని హుక్ స్టెప్స్, హై ఎనర్జీ లిరిక్స్, అనిరుధ్ మ్యూజిక్.
అరివు రాసిన లిరిక్స్ చాలా క్యాచీగా ఉండడంతో పాట మరింత ఆకర్షణీయంగా మారింది. రజినీ స్టైల్, అనిరుధ్ బీట్స్, టి. రాజేందర్ ఎనర్జీ ఈ పాటకు మరింత బలాన్నిచ్చాయి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ, “చికిటు” చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇతర ప్రమోషనల్ కంటెంట్ కూడా త్వరలో రాబోతుండగా, “కూలీ” సినిమాతో రజినీ మరో మాస్ బ్లాక్‌బస్టర్ అందుకుంటారేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.