
రిలయన్స్ జియో, మొబైల్ డేటా వినియోగదారుల కోసం అత్యంత చౌకగా రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉంచుతోంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో ఎక్కువ డేటా అవసరమవుతున్న వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మీరు ప్రీపెయిడ్ యూజర్ అయితే, ఈ ప్లాన్లను పరిశీలించడం తప్పనిసరి. ఇప్పుడు మనం జియో అందిస్తున్న ఐదు చౌకైన డేటా ప్లాన్ల గురించి తెలుసుకుందాం.
రూ.11 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా ఒక గంట పాటు అపరిమిత హై స్పీడ్ డేటా పొందవచ్చు. ఆ తరువాత స్పీడ్ 64kbpsకి తగ్గుతుంది. ఇది తక్కువ సమయంలో ఎక్కువ బ్రౌజింగ్ అవసరమైన వారికి అనుకూలం.
రూ.19 ప్లాన్: ఇది ఒక రోజు చెల్లుబాటుతో 1 GB హై స్పీడ్ డేటాను అందిస్తుంది. తక్కువ వ్యయంతో తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
రూ.29 ప్లాన్: ఈ ప్లాన్ రెండు రోజుల చెల్లుబాటుతో 2 GB డేటా లభ్యమవుతుంది. డేటా అవసరం మరింత ఉంటే ఈ ప్లాన్ సరైన ఎంపిక అవుతుంది.
రూ.49 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా ఒక రోజులో 25 GB డేటా లభిస్తుంది. ఇది ఒకే రోజులో భారీగా డౌన్లోడ్ లేదా స్ట్రీమింగ్ అవసరమవుతున్న వినియోగదారులకు ఉత్తమమైనది.
రూ.69 ప్లాన్: ఇది 7 రోజుల చెల్లుబాటుతో 6 GB డేటాను అందిస్తుంది. వారం రోజుల పాటు సాధారణ వినియోగదారులకు ఇది చక్కటి ఎంపికగా నిలుస్తుంది.
ఇవన్నీ కేవలం డేటా ప్లాన్లు మాత్రమే. అంటే, ఈ ప్లాన్లతో కాల్స్ లేదా ఎస్ఎంఎస్ సదుపాయం ఉండదు. కేవలం ఇంటర్నెట్ అవసరాల కోసం చూస్తున్నవారికి ఇవి చౌకగా, సౌకర్యవంతంగా ఉపయోగపడతాయి.