
సినీ ఇండస్ట్రీలో ఎవరి భాగ్యానైనా ఒక్క శుక్రవారం మార్చేస్తుందన్న మాట మరోసారి నిజమైంది. ఒక ఫ్రైడే హీరోకు బాగా కలిసొస్తే, కెరీర్ దిశ మలుపుతీసుకుంటుంది. అదే జరుగుతోంది కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్‌కు. ఓ హిట్‌తో స్పీడ్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. “దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు”, శివకార్తికేయన్ ఫేమ్ ఉన్నప్పుడే అవకాశాలను రిఫండ్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
‘అమరన్’ సినిమా ఘన విజయం సాధించడంతో శివకార్తికేయన్ వంద కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. దీంతో అతడి మార్కెట్ మల్టీపుల్‌గా పెరిగింది. ఈ జోష్‌లో తన 25వ సినిమా ‘పరాశక్తి’ని లైన్‌లో పెట్టాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టుతో పాటు మరిన్ని సినిమాలను కూడా ప్లాన్ చేస్తున్నాడు, వాటి గురించి తాజా అప్డేట్లు ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతున్నాయి.
ఈ క్రమంలో శివకార్తికేయన్, డైరెక్టర్ శిబి చక్రవర్తితో కలిసి ‘SK-24’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా, ఎస్. జే. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇది కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు అతడు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టడం విశేషం. ఈ వేగాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలిసి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా ఓ మూవీ చేయబోతున్నాడు శివకార్తికేయన్. ఈ చిత్రానికి టైటిల్ “టైమ్ ట్రావెల్”గా ఫిక్స్ చేస్తున్నట్టు సమాచారం. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఇది భారీ VFX, ఎంటర్‌టైన్మెంట్ కలగలిపిన ఓ మల్టీ జానర్ మూవీగా తెరకెక్కనుందట.
ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లు ఎంపిక చేసినట్టు టాలీవుడ్ టాక్. కాయాదు లోహర్, కళ్యాణి ప్రియదర్శన్ ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా శివకార్తికేయన్ తన కెరీర్‌లో బిగ్ లెవల్ స్పీడ్ అందుకుంటూ, వరుస సినిమాలతో అందరినీ షాక్‌కి గురిచేస్తున్నాడు.