spot_img
spot_img
HomePolitical Newsహైదరబాద్ కి సమానంగా వరంగల్ నగరం - రేవంత్

హైదరబాద్ కి సమానంగా వరంగల్ నగరం – రేవంత్

హైదరాబాద్‌తో సమంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు.

వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ. 6500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వరంగల్‌కు విమానాశ్రయం తెచ్చామని, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు శివునిపల్లి కేంద్రం నుంచి విర్చువల్‌గా ప్రారంభించారు. రూ.102.1 కోట్లతో మహిళాశక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన 7 ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి గారు లబ్ధిదారులకు అందజేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 48,717 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీగా 92 కోట్ల 74 లక్షల చెక్కును అందజేశారు. జనగామ జిల్లాలోని 1289 SHG సంఘాలకు 100.93 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి గారు అందజేశారు. ఈ సందర్భంగా “ప్రజాపాలన – ప్రగతి బాట సభ”లో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ గారు, ధనసరి సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీ కడియం కావ్య గారు, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

  • రూ.200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
  • రూ.5.5 కోట్లతో ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ
  • రూ.45. 5 కోట్లతో 100 పడకల ఆస్పత్రి
  • రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్
  • రూ.148.76 కోట్లతో దేవాదుల రెండో దశ, RS ఘన్‌పూర్ ప్రధాన కాలువ లైనింగ్ పనులు
  • 512 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
  • పలు రహదారుల విస్తరణ, సబ్ స్టేషన్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments