spot_img
spot_img
HomePolitical NewsNationalIPL 2025కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త  గాయం నుంచి కోలుకున్న నితీష్ రెడ్డి తిరిగి...

IPL 2025కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త  గాయం నుంచి కోలుకున్న నితీష్ రెడ్డి తిరిగి జట్టులోకి.

ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుకు శుభవార్త అందింది. స్టార్ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) తిరిగి జట్టులోకి రాబోతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతడికి బీసీసీఐ మెడికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఆస్ట్రేలియా గడ్డపై సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన నితీష్, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ సమయంలో గాయపడిపోయాడు. రెండో టీ20 మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో పక్కటెముకలకు గాయమైంది. దీంతో అతడు భారత జట్టుకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (NCA) రిహాబిలిటేషన్ తీసుకున్న నితీష్, ఇప్పుడు ఫుల్ ఫిట్‌నెస్ సాధించాడు.

యోయో టెస్ట్‌లో 18.1 స్కోర్ సాధించిన నితీష్ కుమార్ రెడ్డికి, బీసీసీఐ మెడికల్ టీమ్ పూర్తిగా అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో అతడు ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుండగా, సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో నితీష్ రెడ్డి అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. 13 మ్యాచ్‌ల్లో 303 పరుగులు సాధించగా, ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లో మూడు వికెట్లు కూడా తీసాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అతడు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు.

IPL 2024లో శ్రీనివాస రెడ్డి అద్భుతంగా రాణించడంతో, అతడికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టులో చోటు లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నితీష్, ఇప్పుడు తిరిగి IPLలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. సన్‌రైజర్స్ జట్టుకు నితీష్ రీ-ఎంట్రీ పెద్ద బూస్ట్ ఇవ్వనుంది.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments