spot_img
spot_img
HomePolitical NewsAndhra Pradeshపవన్ కల్యాణ్ స్పీచ్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలతో ముంచేశారు.

పవన్ కల్యాణ్ స్పీచ్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలతో ముంచేశారు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ ఇచ్చిన పవర్‌ఫుల్ స్పీచ్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమ్ముడి స్పీచ్ చూసి ఫిదా అయ్యానని, ఆయన మాట్లాడిన విధానం, ప్రజలతో కలిసిన తీరు ఎంతో భావోద్వేగాన్ని కలిగించిందని తెలిపారు. ఈ మేరకు చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యేకంగా ఓ పోస్ట్‌ చేశారు.

“ప్రియమైన తమ్ముడు పవన్ కల్యాణ్, జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నువ్వు ఇచ్చిన స్పీచ్ చూసి ఫిదా అయ్యాను” అంటూ చిరంజీవి రాసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “సభలో పాల్గొన్న అశేష జనసంద్రంలానే నా మనసు కూడా ఉప్పొంగిపోయింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది” అంటూ పవన్ కల్యాణ్‌ నాయకత్వాన్ని ప్రశంసించారు. “నీ ఉద్యమస్ఫూర్తి కొనసాగాలని, నీ జైత్రయాత్ర విజయవంతం కావాలని హృదయపూర్వక ఆశీస్సులు” అని పేర్కొన్నారు.

గురువారం పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. పవన్ కల్యాణ్ స్పీచ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సభకు భారీ స్థాయిలో జనసేన కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. స్పీచ్ సందర్భంగా పవన్ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడం, ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేయడం ప్రత్యేకంగా నిలిచింది.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “కరెంట్ షాక్ తగిలి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. కొండగట్టు ఆంజనేయ స్వామి దీవెనలు, నా అభిమానుల ప్రేమ వల్లనే పునర్జన్మ లభించింది” అన్నారు. జనసేన జన్మస్థలం తెలంగాణ అని ప్రగల్భంగా ప్రకటించారు. “నాకు గద్దర్ అంటే ఎంతో అభిమానం. నేను దారథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యాను” అంటూ తన రాజకీయ స్ఫూర్తిని వివరించారు.

మెగా ఫ్యాన్స్, జనసైనికుల సంబరాలు మెగాస్టార్ చిరంజీవి పవన్ కల్యాణ్‌ స్పీచ్‌పై ఇచ్చిన స్పందన జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పవన్ కల్యాణ్ ప్రజల కోసం పని చేసే నిజమైన నాయకుడు అని చిరంజీవి ప్రశంసించడంతో, మెగా ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పవన్ రాజకీయ ప్రయాణం మరింత ఉద్ధృతం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments