
బాలీవుడ్ ప్రముఖ జంట కియారా అడ్వాణీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా శుక్రవారం ఎంతో ప్రత్యేకమైన వార్తను పంచుకున్నారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. బేబీ సాక్స్‌ను చేతుల్లో పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “మా జీవితానికి అద్భుతమైన బహుమతి త్వరలో రానుంది” అంటూ క్యాప్షన్ జతచేశారు. దీంతో, నెటిజన్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సమంత, ఇషాన్ కట్టర్, శిల్పా శెట్టి తదితరులు కియారా-సిద్ధార్థ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
కియారా-సిద్ధార్థ్ జంట 2021లో విడుదలైన ‘షేర్షా’ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది, అది ప్రేమగా మారింది. తమ కుటుంబాల అంగీకారంతో 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్ సూర్యగఢ్ హోటల్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్‌లోనే మోస్ట్ లవ్డ్ కపుల్స్‌లో ఒకరిగా వీరు నిలిచారు.
ఇటీవల కియారా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటించారు. పాత్ర చిన్నదే అయినా, ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘డాన్ 3’, అలాగే హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్ 2’లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.
సిద్ధార్థ్ మల్హోత్రా గతేడాది ‘యోధ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో రాశీ ఖన్నా, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పరమ్ సుందరి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్నారు. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫ్యాన్స్‌లో భారీ ఆనందం కియారా-సిద్ధార్థ్ తల్లిదండ్రులు కాబోతున్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరి అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ జంట నుంచి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.