spot_img
spot_img
HomePolitical NewsAndhra Pradesh1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు - CBN

1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు – CBN

గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం…1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు.గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేము నిరంతరం పనిచేస్తున్నాం. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించాము. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాము.


ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయ్యింది. దాని పునరుద్ధరణకు మేము కృషి చేస్తాము. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని… అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరుతున్నా. సమాజంలో అట్టడుగున ఉన్న మీ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు ప్రజలకి మరియు మీడియాకి చెప్పుకొచ్చారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments