spot_img
spot_img
HomeFilm NewsBollywoodహీరోగా రోషన్ కనకాల  ‘మోగ్లీ 2025’ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల.

హీరోగా రోషన్ కనకాల  ‘మోగ్లీ 2025’ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల.

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala) మరియు స్టార్ యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) ప్రస్తుతం హీరోగా స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా, ‘మోగ్లీ 2025’ (Mowgli 2025) సినిమా నుండి నయా పోస్టర్ విడుదలైంది. ఈ కొత్త లుక్, సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

‘నిర్మలా కాన్వెంట్’ ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టిన రోషన్, ఇటీవల ‘బబుల్ గమ్’ (Bubble Gum) అనే సినిమా ద్వారా హీరోగా కనిపించాడు. నటుడిగా రోషన్‌కి మంచి గుర్తింపు వచ్చినా, ఆ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేకపోయింది. కానీ ఇప్పుడేమో, ‘మోగ్లీ 2025’తో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం రోషన్ హీరోగా ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ (Sandeep Raj) ‘మోగ్లీ 2025’ (Mowgli 2025) అనే సరికొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని కీలక సన్నివేశాలను రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో రెండు భారీ సెట్స్ వేసి చిత్రీకరించారని సమాచారం.

ఈ సినిమాలో సాక్షి సాగర్ మడోల్కర్ (Sakshi Sagar Madolkar) హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కాలభైరవ (Kaala Bhairava) ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ ప్రకారం, ఈ మూవీ వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులను మెప్పించనున్నట్లు తెలుస్తోంది.

బర్త్‌డే స్పెషల్ పోస్టర్మార్చి 15న రోషన్ పుట్టినరోజు సందర్భంగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People’s Media Factory) సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ రోషన్‌ని విభిన్న లుక్‌లో చూపిస్తూ, సినిమా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చింది. త్వరలోనే టీజర్, ఇతర అప్‌డేట్స్ రానున్నాయి. ఈ సినిమా రోషన్ కెరీర్‌కు కీలక మలుపుగా మారుతుందేమో చూడాలి

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments