spot_img
spot_img
HomeFilm Newsస్వయంభు కొత్త విడుదల తేదీ వెల్లడైంది.

స్వయంభు కొత్త విడుదల తేదీ వెల్లడైంది.

‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, ఆ తర్వాత తీసుకున్న కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ‘18 పేజెస్’ పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ‘స్పై’ వంటి సినిమాలు భారీ డిజాస్టర్లుగా మారడంతో, నిఖిల్ తన కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ, ఇప్పుడు తన ఆశలన్నీ పీరియాడిక్ వార్ డ్రామా ‘స్వయంభు’పై పెట్టుకున్నాడు.

‘స్వయంభు’ సినిమా కోసం నిఖిల్ దాదాపు రెండేళ్ల పాటు పూర్తిగా కమిట్ అయ్యాడు. గెటప్స్ మార్చడం మాత్రమే కాకుండా, పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా పెద్ద మార్పులు చేసుకున్నాడు. గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు వంటి కఠినమైన శిక్షణ తీసుకుని పాత్రలో ఒదిగిపోయేందుకు శ్రమించాడు. ఈ సినిమా నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది.

170 రోజుల భారీ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘స్వయంభు’ టీమ్ ఇటీవలే గుమ్మడికాయ కొట్టింది. మొదట ఈ ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తయినప్పటికీ, ప్రమోషన్లు మాత్రం ఇంకా ఊపందుకోలేదు.

సంక్రాంతికి విడుదలైన పోస్టర్లలో కనిపించిన రిలీజ్ డేట్ తర్వాత మాయమవడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఫిబ్రవరిలో సినిమా విడుదల కష్టమేనని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘స్వయంభు’ మార్చి 23 లేదా ఏప్రిల్ 30న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మొత్తానికి, ‘స్వయంభు’ నిఖిల్‌కు మరో పాన్ ఇండియా హిట్ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. భారీ కథ, పీరియాడిక్ సెటప్, నిఖిల్ చేసిన కష్టానికి తగ్గ ఫలితం దక్కితే, ఆయన కెరీర్ మళ్లీ ట్రాక్‌లో పడటం ఖాయం అని అభిమానులు ఆశిస్తున్నారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments