
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం అనేక కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి మహిళలకు ఇది నిజమైన వరంగా మారింది. ఆసుపత్రికి వెళ్ళడానికి లేదా ఇతర అవసరాల కోసం బస్సు చార్జీలు భరించడం చాలా మందికి కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం వారికి గొప్ప ఊరట కలిగిస్తోంది.
ఒక మహిళ వైద్య అవసరాల కోసం ఆసుపత్రికి వెళ్లడం తప్పనిసరి అయ్యింది. కానీ ప్రతిసారి బస్సు చార్జీలకు రోజుకు సుమారు రూ.200 ఖర్చవ్వడం వల్ల, ఆమెకు ఇబ్బందులు తలెత్తాయి. పిల్లల్ని అడగాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చేది. బయట వారిని అప్పు అడగాలంటే సిగ్గు అనిపించేది. చివరికి ఆసుపత్రికి వెళ్ళడమే మానుకోవాల్సి వచ్చింది.
అలాంటి సమయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం ఆమెకు నిజమైన రక్షణగా నిలిచింది. ఇప్పుడు ఆ మహిళ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉచితంగా బస్సులో ప్రయాణిస్తూ ఆసుపత్రికి వెళుతోంది. ఇది కేవలం సౌకర్యం మాత్రమే కాకుండా, ఆమెకు తిరిగి ఆత్మగౌరవాన్ని ఇచ్చింది.
బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఇతరులు “ఏంటమ్మా ఈ కన్నీళ్లు?” అని అడిగితే, ఆమె ఆనందంతో “చంద్రన్న అందించిన సాయానికి కృతజ్ఞతగా వచ్చే ఆనందభాష్పాలు ఇవి” అని చెబుతోంది. ఈ పథకం వల్ల అనేక మంది మహిళలు తాము స్వతంత్రంగా, గౌరవంగా జీవించగలుగుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్త్రీశక్తి పథకం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఒక పెద్ద సామాజిక మార్పుకు నాంది పలుకుతోంది. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళల ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలను మెరుగుపరచే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం మరింత ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


