
తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) మరియు అంజలి (Anjali) జంట ఈ ఏడాది విడుదలైన మద గజ రాజా (Madha Gaja Raja) సినిమాలో కనిపించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో మేకర్స్ విశాల్ 35వ చిత్రంలోనూ అంజలిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి (RB Chowdary) తమ సూపర్ గుడ్ ఫిలిమ్స్ (Super Good Films) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో ఇది 99వ సినిమా కావడం విశేషం.
ఈ చిత్రంలో ఇప్పటికే దుషారా విజయన్ ప్రధాన నాయికగా నటిస్తోంది. తంబి రామయ్య, అర్జై వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా అంజలి కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. విశాల్, అంజలి జంట గతంలో చూపించిన కెమిస్ట్రీ అభిమానుల్లో ప్రత్యేకంగా నిలిచింది.
జూలైలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగగా, ఆగస్ట్ 1న తొలి షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఊటీలో సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లోనే అంజలి కూడా టీమ్‌తో జతకలిసింది. ఈ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహిస్తుండగా, మద గజ రాజా ఫేమ్ రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
అలాగే, విశాల్ మార్క్ ఆంటోనీకి మ్యూజిక్ అందించిన జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నాన్ స్టాప్ షెడ్యూల్‌లో ఈ సినిమాను 45 రోజుల్లో పూర్తిచేయాలని మేకర్స్ నిర్ణయించారు.
మద గజ రాజా సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని, విశాల్-అంజలి జంటపై మళ్లీ పెద్ద అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంటారా అన్నది చూడాలి.


