
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Sudeep) త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే, అతని స్థానాన్ని భర్తీ చేసే పనిలో ఇప్పుడు సుదీప్ కూతురు సాన్వీ (Sanvi) ఉన్నట్లు తెలుస్తోంది. నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, అలాగే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె తహతహలాడుతోంది.
సుదీప్ రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
సుదీప్ ఇటీవల తన “మ్యాక్స్” (Max) సినిమా ప్రమోషన్ల సందర్భంగా, తాను త్వరలో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పారు. అయితే, ఇది తాను అలసిపోయాననే అర్థంలో కాదు, ఒక దశలోనైనా వైదొలగాల్సిందే కదా అని చెప్పారు. అయితే, సుదీప్ తీసుకున్న ఈ నిర్ణయం తన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అతని రిటైర్మెంట్ నిర్ణయం అంత త్వరగా అమలు కాని అవకాశముందని, ఇదంతా యథాలాపంగా అన్న మాటే కావొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
సాన్వీ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని తపన
సుదీప్ కూతురు సాన్వీ, తన తండ్రి పేరుతో కాకుండా తన ప్రతిభతో గుర్తింపు పొందాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఆమె హైదరాబాద్‌లో ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్ కు సంబంధించిన ప్రత్యేక శిక్షణలో పాల్గొన్నట్లు సమాచారం. హీరోయిన్ మాత్రమే కాకుండా, సినిమా ఫీల్డులో కెమెరా వెనుక కూడా పని చేయాలనే ఆసక్తి ఆమెకు ఉంది.
సాన్వీ వెండితెరపై ఎంట్రీకి సిద్ధమా.
సాన్వీ ఇటీవల “తాను లావుగా ఉన్నాను, అందంగా కనిపించేందుకు డైటింగ్ చేయడం మొదలు పెట్టాను” అని చెప్పడం ఆసక్తి రేపింది. నటిగా రాణించాలన్న తపనతో పాటు, దర్శకత్వం మీద కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తండ్రి సుదీప్ స్టార్డమ్‌ను దగ్గరగా చూసిన సాన్వీ, సినిమా రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోంది.
ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఎప్పుడైనా డెబ్యూట్ చేయనున్నారా? ఇప్పటికే సుదీప్ అభిమానులు సాన్వీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె ఎప్పుడు వెండితెరపై అరంగేట్రం చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తండ్రి ఆశీస్సులతో సాన్వీ త్వరలో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించనుందా? అన్నది వేచి చూడాల్సిన అంశం. సుదీప్ అభిమానుల ప్రేమ, జనాల అంచనాలు ఆమెకు ఎంతవరకు కలిసివస్తాయో చూడాలి