
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్, తన నటనతో ఇప్పటికే కొన్ని చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలం బ్రేక్ తీసుకున్న అతను, తాజాగా “ఒక పథకం ప్రకారం” అనే థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మలయాళ దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని, భానుశ్రీ కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై పాజిటివ్ స్పందన పొందింది. ఇప్పుడు జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ కథ కావడంతో ప్రేక్షకులలో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. థియేటర్లలో రిలీజ్ సమయంలో, ఇంటర్వెల్‌కు ముందు విలన్‌ను అంచనా వేసిన 50 మంది విజేతలకు రూ.10,000 చొప్పున బహుమతులు ఇచ్చారు — మొత్తం రూ.5 లక్షలు.
ఓటీటీ విడుదల సందర్భంగా నిర్మాతలు స్పందిస్తూ, “మంచి కథలు ఎప్పుడు ప్రేక్షకుల ఆదరణ పొందుతాయి. థియేటర్లలోనే కాక, ఓటీటీలో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది” అన్నారు. అలాగే సన్ నెక్స్ట్ కంటెంట్ హెడ్ శశికిరణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కథ విషయానికొస్తే — సాయి రామ్ శంకర్ పోషించిన సిద్ధార్థ్ ఒక న్యాయవాది. అతని భార్య సీత కనిపించకపోవడంతో, మనోవేదనలో డ్రగ్స్‌కు అలవాటు పడతాడు. ఆ సమయంలో వరుస హత్యలు జరగడం, పోలీసుల అనుమానాలు, అరెస్టులు — ఇవన్నీ కథలో ట్విస్టులుగా నిలుస్తాయి. అసలు నిజం ఏంటి? మర్డర్స్ వెనక ఎవరు ఉన్నారు? అన్నది సినిమా చివరిలో క్లారిటీగా తెలుస్తుంది. థ్రిల్లర్ ప్రేమికుల


