
ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IIULER) స్థాపనకు సంబంధించిన బిల్లు ప్రతిపాదించబడింది. ఈ బిల్లు ఏకగ్రీవంగా శాసనసభలో ఆమోదించబడింది. రాష్ట్రంలో లీగల్ ఎడ్యుకేషన్ రంగంలో నూతనతను ప్రవేశపెట్టడం, విద్యార్థులకి మరింత అవకాసాలు కల్పించడం, మరియు పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం ఈ యూనివర్సిటీ ముఖ్య లక్ష్యాలు.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు వ్యక్తిగత శ్రద్ధతో ఈ యూనివర్సిటీ మంజూరు చేయించడం విశేషం. శాసనసభ తరపున గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. IIULERని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించబడింది. ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో లీగల్ విద్యను నూతన స్థాయికి తీసుకెళ్తుంది. ఇది కేవలం విద్యార్థులకి కాకుండా, న్యాయవ్యవస్థకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
IIULERతో అనుబంధంగా అనేక అసోసియేట్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాట్లను చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిలో ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ సెంటర్, కన్సల్టేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్, మరియు జ్యుడీషియల్ ట్రైనింగ్ సెంటర్ ముఖ్యంగా ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులు కేవలం తరగతుల్లో మాత్రమే కాక, ప్రాక్టికల్ అనుభవం కూడా పొందగలుగుతారు.
ఈ యూనివర్సిటీలో 2025-26 సబ్జెక్ట్ అడ్మిషన్స్ ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా, రాష్ట్రంలోని స్థానికులకు 20% సీట్లు కేటాయించబడతాయి. ఇది స్థానిక యువతకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తుంది. విద్యార్థులు న్యాయవిషయాలపై లోతైన అవగాహన పొందగలుగుతారు. అదనంగా, పీజీ, పిహెచ్‌డీ వంటి పరిశోధన కార్యక్రమాలు కూడా ఈ యూనివర్సిటీ ద్వారా మరింత ప్రోత్సహించబడతాయి.
కూటమి ప్రభుత్వ లక్ష్యం కేవలం లీగల్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా, పరిశోధనలకు కేంద్రంగా IIULERను తీర్చిదిద్దడం. విద్యార్థులు న్యాయశాస్త్రంలో విశ్లేషణ, పరిశోధన, మరియు ప్రాక్టికల్ అనుభవంలో నైపుణ్యం పొందగలుగుతారు. ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు, భారతదేశానికి విశ్వస్ధమైన న్యాయవేత్తలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.