
మలయాళ విలక్షణ నటుడు షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సూత్రవాక్యం (Soothravakyam) ఇటీవల మలయాళంలో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి అనువదించబడుతోంది. విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం.నాయర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో దర్శకుడిగా యూజియాన్ జాస్ చిరమ్మల్ పరిచయమయ్యారు.
తెలుగులో ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై కాండ్రేగుల లావణ్యాదేవి సమర్పణలో కాండ్రేగుల శ్రీకాంత్ తీసుకువస్తున్నారు. మలయాళంలో అందరి హృదయాలను గెలుచుకున్న ఈ కథ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. జూలై 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా మేకర్స్ తాజా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే కథలో ఉన్న భావోద్వేగాలు, సామాజిక అంశాలు స్పష్టంగా కనబడతాయి. కోవిడ్ సమయంలో కేరళలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ప్రారంభమైన కౌన్సిలింగ్ కార్యక్రమాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. యువతలో ధైర్యాన్ని నింపే విధంగా ఈ చిత్రం సాగుతుంది. ఇది నూతన దిశలో ప్రయాణించేందుకు ప్రయత్నించే ఒక వినూత్న చిత్రం.
తెలుగు నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించడం విశేషం. కథను ప్రామాణికంగా నిలిపేలా ఆయన పాత్రకు ప్రాధాన్యత ఉంది. ఒక సామాజిక సందేశాన్ని కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి స్పందన రాబట్టే అవకాశముంది.
మొత్తానికి, సూత్రవాక్యం చిత్రంతో షైన్ టామ్ చాకో తెలుగులోనూ తన ముద్ర వేయబోతున్నాడు. విభిన్నమైన కథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఇది తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది.