
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ – 2025 కు గ్లోబల్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు, లండన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొనడం నాకు గౌరవంగా అనిపించింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు యుకె బిజినెస్ ఫోరం కలిసి నిర్వహించడం విశేషం.
ఈ రోడ్ షోకు టెక్ మహీంద్రా యూరప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అస్నానీ సంధానకర్తగా వ్యవహరించారు. ఆయన సమన్వయంతో కార్యక్రమం అత్యంత విజయవంతంగా సాగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విశాలమైన అవకాశాలను, ప్రభుత్వం తీసుకుంటున్న పారదర్శక విధానాలను వివరిస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని కల్పించాను.
ప్రత్యేకంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలను వివరించడం ద్వారా పెట్టుబడిదారులకు తక్షణ పరిష్కారాలు, సమర్థవంతమైన వాతావరణం లభిస్తుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాను. పారిశ్రామిక వృద్ధి కోసం అవసరమైన మౌలిక వసతులు, మానవ వనరులు, విద్యావంతులైన యువశక్తి గురించి వివరించాను.
ఈ రోడ్ షోలో యుకె డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ ప్రెసిడెంట్ హర్షుల్ అస్నానీ, ఐసిఐసిఐ బ్యాంక్ యుకె విభాగం సీఈఓ రాఘవ్ సింఘాల్, ఎపిఐఐసి వైస్ చైర్మన్ & ఎండి అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన 150 మంది సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు హాజరుకావడం ఈ సమావేశానికి విశిష్టతను తీసుకువచ్చింది.
ఈ రోడ్ షో ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక శక్తి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం అంతర్జాతీయ వేదికపై ప్రతిఫలించబడింది. రాబోయే పార్టనర్‌షిప్ సమ్మిట్ – 2025 లో విశాఖపట్నం గ్లోబల్ స్థాయి పెట్టుబడిదారుల సమాగమానికి సాక్ష్యం కానుంది. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి విస్తృత స్థాయిలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి దిశగా కొత్త మార్గాలు లభిస్తాయని నమ్ముతున్నాను.


