
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘RC16’ సినిమాపై అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర బృందం చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. అదే సమయంలో ‘RC16’కి మొదటి నుంచి ప్రచారంలో ఉన్న ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేశారు.
ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో చరణ్ కనిపించనున్నారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో జగపతిబాబు కూడా కీలక పాత్రలో ఉంటారు.
మ్యూజిక్ పార్ట్‌కి సంబంధించిన బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) చేపట్టారు. ఆయన అందించిన స్వరాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం తెలిపింది. రామబ్రహ్మం సుంకర సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
రామ్ చరణ్ కెరీర్‌లో ‘RC16’ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది. బుచ్చిబాబు సానా, చరణ్ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఉప్పెన’ తరహాలో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అభిమానులు ‘పెద్ది’ టైటిల్‌తో మూవీ ఎలా ఉండబోతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.