
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘రామాయణం’. ఈ పౌరాణిక చిత్రం దర్శకుడు నితేష్ తివారీ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. ‘రామాయణం పార్ట్ 1’ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సెట్స్‌లో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా సమాచారం ప్రకారం, రామాయణం మూవీ నుంచి బిగ్ అప్డేట్ రాబోతోందట. బెంగళూరులో గ్రాండ్‌గా ‘రామాయణం లోగో లాంచ్’ ఈవెంట్ నిర్వహించనున్నారు. అదే వేదికపై టైటిల్ టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఈ ఈవెంట్ జూలై 3న జరగనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ టీజర్ రిలీజ్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఆ స్కేల్‌లో విజువల్ గ్రాండియరిటీ ఇవ్వడానికి వీఎఫ్ఎక్స్ కంపెనీ DNEG పని చేస్తోంది. ఇదే సంస్థ హాలీవుడ్‌కి కూడా అద్భుతమైన విజువల్స్ అందించింది. టీజర్ దాదాపు మూడు నిమిషాల నిడివితో రెడీ అయ్యిందని సమాచారం. ఇది పౌరాణిక సినిమాల్లో ఓ విజువల్ వండర్‌గా నిలవబోతోందని సినీ విశ్లేషకుల అంచనా.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, లారా దత్త కైకేయిగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా కథను ఆధునిక తరానికి తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ మహాపౌరాణిక చిత్రాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. రెండో భాగాన్ని 2027 దీపావళికి తెరపైకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ భారతీయ సినీ పరిశ్రమలో మైలురాయిగా నిలవనుంది.


