
తెలంగాణ అసెంబ్లీలో ‘మార్చురీ’ అనే పదాన్ని ఉపయోగించిన అంశం పెద్ద చర్చకు దారి తీసింది. మాజీ సీఎం కేసీఆర్ (KCR)ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ (BRS) నేతలు ఆరోపించగా, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి “మార్చురీ అనే పదాన్ని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించే వాడాను, కానీ కేసీఆర్‌ను ఉద్దేశించి కాదు” అని స్పష్టం చేశారు. “మీరు స్ట్రెచర్ గురించి మాట్లాడుతున్నారు.. మీకు రాష్ట్ర భవిష్యత్తు అవసరం లేదు” అని అన్నారు. “కేసీఆర్‌కు నాలుగు కోట్ల మంది ప్రజలు అధికారాన్ని లాక్కొని నాకు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ వద్ద ఏముంది?” అంటూ ఘాటుగా స్పందించారు.
“నేను ఎప్పుడూ కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. కానీ అతను ప్రతిపక్షంలోనే ఉండాలి, నేను అధికారంలో ఉండాలి” అని రేవంత్ వ్యాఖ్యానించారు. “రోజా గారి రొయ్యల పులుసు తిన్నది కేసీఆరే కదా? రాయలసీమను రత్నాల సీమ చేసింది కేసీఆర్ కాదా? ఇప్పుడు ఆsame కేసీఆర్ మాకు ఎండబెడతారా?” అంటూ ఎద్దేవా చేశారు.
“కమీషన్లకు అమ్ముడుపోకుండా, జూరాల నుంచి కృష్ణా నీళ్లు తీసుకునివచ్చి ఉంటే.. ఏపీ మన ముందు మోకరిల్లేది” అన్నారు. “కేసీఆర్ తండ్రి, కొడుకు, అల్లుడు కలిసి పైశాచిక ఆనందం పొందుతున్నారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్” అని ఆరోపించిన రేవంత్, “ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం. మీరు కేసీఆర్‌ను సభకు రప్పించండి” అన్నారు. “నా వ్యాఖ్యలు తప్పని రుజువుచేస్తే, కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు క్షమాపణ చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు.