
తిరుపతి టీడీపీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాలు చేపట్టడంలో ముందున్నవారిని అభినందించారు. కోటి మంది టీడీపీ కుటుంబ సభ్యుల సంక్షేమానికి కృషి చేసే బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చారు. ఐక్యమత్యంగా పనిచేసే టీడీపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి నియోజకవర్గ పర్యటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచి వారిని అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.
ఎన్నికల్లో గెలిచాం, తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు అంకితభావంతో పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తామన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వంపై వైసిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కోటి మంది పార్టీ కుటుంబ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి నారా లోకేష్ తిరుపతి నగరానికి కార్పొరేటర్లతో సమావేశమై నగర అభివృద్ధికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.