
బెంగళూరులో ఉద్యోగ, వ్యాపార రీత్యా స్థిరపడినప్పటికీ, తమ మాతృభూమి అభివృద్ధి పట్ల అనురక్తి కలిగిన తెలుగువారు ఒకే వేదికపై చేరి ఏర్పాటుచేసుకున్న “బెంగళూరు టీడీపీ ఫోరమ్“ నేడు తన 12వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఫోరమ్‌లో భాగమైన యువత తమ జీవితాల్లో ఆర్థిక ప్రగతి, అభివృద్ధికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజనరీ నాయకత్వం అని గాఢంగా విశ్వసించారు. రాష్ట్రం స్వర్ణాంధ్రంగా అవతరించాలన్న కలతో ఈ ఫోరమ్ ఏర్పడింది. ఈ సందర్భంగా ఫోరమ్ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తెలుగుదేశం పార్టీ పట్ల అపారమైన విశ్వాసం, రాష్ట్ర అభ్యున్నతి పట్ల అచంచలమైన నిబద్ధతతో ఈ ఫోరమ్ ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు పొందింది. బెంగళూరులో నివసిస్తున్నప్పటికీ, రాష్ట్ర సమస్యలు, ప్రజల అభివృద్ధి పట్ల ఈ సభ్యులు చూపిన అంకితభావం ప్రశంసనీయం. రాష్ట్ర పునర్నిర్మాణం, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉద్యోగావకాశాల సృష్టి వంటి అంశాలలో చంద్రబాబు గారి పరిపాలనా ప్రతిభ పట్ల యువతకున్న విశ్వాసమే ఈ ఫోరమ్‌ను ముందుకు నడిపించింది.
తెలుగు యువతలో ఐక్యతను పెంపొందించడం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన కల్పించడం, తెలుగుదేశం పార్టీ పట్ల విశ్వాసాన్ని మరింత బలపరచడం వంటి కార్యక్రమాలలో ఈ ఫోరమ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం సాంకేతిక వేదికలను వినియోగిస్తూ, ప్రజల్లో సచేతనత పెంచే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా గణనీయమైన ప్రభావం చూపింది.
మాతృభూమి అభ్యున్నతి కోసం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. ఈ 12 ఏళ్ల కాలంలో ఫోరమ్ సాధించిన విజయాలు ప్రతి సభ్యుని కష్టపాటు, అంకితభావానికి నిదర్శనం. భవిష్యత్తులో కూడా మీరు అదే ఉత్సాహం, నిబద్ధతతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.
బెంగళూరు టీడీపీ ఫోరమ్ 12వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాబోయే కాలంలో మీరు చేపట్టే ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా అవతరించాలన్న మీ కల త్వరలోనే సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నాను.