
అనంతపురం పెట్రోల్ బంకుల్లో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. మీటర్ లో ఒక చిన్న చిప్ ను అమర్చి కస్టమర్ల జేబులకి 11 నెలళ్ళో సుమారు 2 కోట్ల రూపాయల పైనే చిల్లు పెట్టారు.
అనంతపురం శివారులోని ఆటో కేర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో విజిలెన్స్ అధికారుల తనికీతో ఘరాణా మోసం వెలుగు లోకి వచ్చింది. మీటరు లో చిన్న చిప్ ని అమర్చి రీడింగ్ ను టాంపరింగ్ చేస్తున్నారు బంక్ నిర్వాహకులు. తూనిక కొలతల శాఖ వాళ్ళు వేసిన సీల్లు వేసినట్టే ఉన్నాయి కానీ , హైదరబాద్ నుంచి అనధికార టెక్నీషియన్స్ తో బాంకు నిర్వాహకులు న్యాక్ గా చిప్ ని ఫిక్స్ చేపించి , బాంకు నిర్వాహకులు 11 నెలలుగా సుమారు 2.7 కోట్ల కి పైనే ప్రజలని మోసం చేసి డబ్బులు దండుకున్నారు.
దీనిపైన విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ .. సీల్ అనేది డ్యామేజ్ కాకుండా లోపల ఉన్న డిస్ప్లే మాధర్ బోర్డు కి ఒక చిన్న చిప్పునీ అమర్చి ట్యాంపర్ చేశారని , దాని కోసం బాంకు నిర్వాహకులు రిమోర్ట్ ని మరియు ఒక చిన్న బటన్ ని ఉపయోగించి ఈ మోసానికి పాల్పడ్డారని, మేము ఇక్కడ చేసిన టెస్ట్ మరియు విచారణ ప్రకారం ప్రతి 10 లీటర్ల పెట్రోల్ / డీజిల్ లో పెట్రోల్ పంపు వాళ్ళు చేసిన ట్యాంపరింగ్ ప్రకారం 1 లీటర్ పైననే ప్రజలని మభ్య పెట్టి మోసం చేస్తున్నారు. సుమారుగా మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం గడిచిన 11 నెలలలో 28 లక్షల 7 వేల 9వందల లీటర్స్ కస్టమర్లకు అమ్మటం జరిగింది. దీని ప్రకారం పెట్రోల్ బాంకు యాజమాన్యం 2కోట్ల 77 లక్షల 99 వేల 800రూపాయలు ప్రజలని మోసం చేసి సంపాదించారు. ఇలాంటి ట్యాంపరింగ్ ని ఇప్పటి వరకు లీగల్ మెట్రాలజీ , విజిలెన్స్ వాళ్ళం రాష్ట్రంలో మొట్ట మొదటి సారి గుర్తించాము. లీగల్ మెట్రాలజీ వాళ్ళు అయితే వేసిన సీల్ వేసినట్టే ఉంది అసలు వీళ్ళు ఎలా దీనిని ట్యాంపరించి చేశారు అని ఇంకా ఆశ్చర్యం లో ఉన్నారు.
పెట్రోల్ బంకులలో ఒక పంపు దగ్గర ఆగిన వాళ్ళని ఇంకో పంపు దగ్గరకి తీసుకుని వెళ్ళి పెట్రోల్ / డీజిల్ పడుతున్నారు అంటే అందులో ఎంతో కొంత మోసం ఉంటుందని ప్రజలు అర్ధం చేసుకోవాలని అధికారులు చెప్పుకొచ్చారు. జరిగిన సంగటన ప్రకారం చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకా చాలా పెట్రోల్ బంకులలో ఇదే తరహా మోసాలు జరుగుతున్నాయి అనిపిస్తుంది.కాబట్టి ప్రజలు అప్రమత్తం గా ఉండాలని చెప్పుకొచ్చారు.