
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్రినిడాడ్ & టొబాగో అత్యున్నత సివిలియన్ అవార్డు ‘ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ & టొబాగో’ అందజేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రినిడాడ్ & టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కాంగలో, ప్రధాని కమ్లా పర్సాద్-బిసెసార్, అక్కడి ప్రభుత్వం మరియు ప్రజలకూ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ గౌరవం రెండు దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని సూచిస్తుందని మోదీ పేర్కొన్నారు. ప్రతి అడుగులోనూ రెండు దేశాల మధ్య ఉండే సాంస్కృతిక అనుబంధం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. భారతదేశం మరియు ట్రినిడాడ్ & టొబాగో మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.
ఈ అవార్డును విదేశీ నాయకుడికి ఇచ్చినది ఇదే మొదటిసారి కావడం తనకు ఎంతో గౌరవంగా ఉందని మోదీ తెలిపారు. ఇది ఒక అరుదైన ఘనతగా, తన రాజకీయ జీవితంలోని అత్యంత మర్చిపోలేని క్షణాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని అన్నారు.
ఈ గౌరవం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని బలపరుస్తుందన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, ప్రజా స్థాయి పరస్పర సంబంధాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాలనే దిశగా భారతదేశం పని చేస్తుందని వివరించారు. ఇలాంటి గౌరవాలు దేశానికి మాత్రమే కాక, దేశ ప్రజల ప్రతిష్టను కూడా ప్రపంచవ్యాప్తంగా పెంచుతాయని మోదీ అన్నారు. ట్రినిడాడ్ & టొబాగోతో ఉన్న సుహృద్బావ సంబంధాలను