
సినీ ప్రియులకు యాక్షన్, ఫన్, థ్రిల్ మిక్స్‌తో వచ్చేందుకు హాలీవుడ్ నుంచి ఓ ఆసక్తికర చిత్రం సిద్ధమైంది. ప్రముఖ రచయిత స్టీఫెన్ కింగ్ నవల ఆధారంగా రూపొందిన “ది రన్నింగ్ మ్యాన్” (The Running Man) సినిమా నవంబర్ 7న విడుదలకు సిద్ధమైంది. ఇది డిస్టోపియన్ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కింది. తాజాగా చిత్రబృందం రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది.
ఈ చిత్రంలో గ్లెన్ పావెల్ హీరోగా నటించగా, విలియం హెచ్. మేసీ, లీ పేస్, ఎమిలియా జోన్స్, మైఖేల్ సెరా, డేనియల్ ఎజ్రా, జేమ్ లాసన్, కోల్మన్ డొమింగో, జోష్ బ్రోలిన్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాంట్ మ్యాన్, టిన్‌టిన్ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలను తెరకెక్కించిన ఎడ్గార్ రైట్ ఈ సినిమాకు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది.
కథలో హీరో తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉంటాడు. డబ్బు అవసరంగా ఉండడంతో ప్రాణాలను పణంగా పెట్టి ఓ గేమ్ షోలో పాల్గొనడానికి సిద్ధమవుతాడు. ఆ షోలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే హంటర్స్ నుంచి తప్పించుకుంటూ 30 రోజులు బతికితే మిలియన్ డాలర్ల బహుమతి దక్కుతుంది. ఈ నేపథ్యంలో జరిగే పోరాటం, సస్పెన్స్, హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ట్రైలర్ చూస్తుంటే కథలో ఉత్కంఠ భరితమైన క్షణాలు, ఉర్రూతలూగించే యాక్షన్ సీన్లు, అలాగే హాస్యానికి తగిన స్థానం ఉన్నట్లు స్పష్టమవుతుంది. ముఖ్యంగా చివర్లో “ఒరేయ్ పంది పిర్రలోడా” అనే డైలాగ్ వినోదాన్ని పంచుతుంది. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం కావడం విశేషం.
ప్రేక్షకులకు వినోదం, థ్రిల్, యాక్షన్ అన్నీ ఒకే ఫ్రేమ్‌లో అందించేందుకు “ది రన్నింగ్ మ్యాన్” సినిమా సిద్ధమవుతోంది. త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా హాలీవుడ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంగా కనిపిస్తోంది.


