spot_img
spot_img
HomeFilm NewsBollywoodదిప్యారడైజ్: జడతాకగానేవాడుజర్ర్మంటూఆశ్చర్యంగావెనక్కితిరిగాడు, కళ్లలోఆశ్చర్యంమెరిపించాడు.

దిప్యారడైజ్: జడతాకగానేవాడుజర్ర్మంటూఆశ్చర్యంగావెనక్కితిరిగాడు, కళ్లలోఆశ్చర్యంమెరిపించాడు.

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దసరా విజయానంతరం, నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రం ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, సినిమా పై ఉన్న ఆసక్తిని మరింతగా పెంచేశాయి.

నాని తన సినిమాలపై హైప్ ఎలా క్రియేట్ చేయాలో బాగా తెలిసిన నటుడు. షూటింగ్ జరుగుతున్నప్పుడే, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ముఖ్యమైన అంశాలను కొద్దికొద్దిగా బయటకు విడుదల చేస్తూ వస్తాడు. ఇప్పటివరకు పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తో అలరించిన నాని, ఇప్పుడు మాస్ హీరోగా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం ఊర మాస్ కథలను ఎంచుకుని, తన లుక్‌లో కూడా విపరీతమైన మార్పు తీసుకొచ్చాడు. ది ప్యారడైజ్ కోసం నాని జడల లుక్‌లో, ముక్కెరతో పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాడు.

గత కొన్ని రోజులుగా, ప్యారడైజ్ నుంచి వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు నాని. మొదట జడల పాత్రను పరిచయం చేస్తూ, అతని లుక్‌ను రివీల్ చేశాడు. తాజాగా “స్పార్క్ ఆఫ్ ది ప్యారడైజ్” అనే యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో ఇంట్రడక్షన్‌ను ఎలివేట్ చేయగా, నాని అందుకు తగ్గట్లుగా యాక్షన్‌లో అదరగొట్టాడు.

ముఖ్యంగా జైలు సీక్వెన్స్‌లో, జడల పాత్ర రౌడీలను చితక్కొట్టే సీన్ ప్రేక్షకులలో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. చివర్లో, “వాడి జడలు ముట్టుకుంటే, వాడికి జర్రుమంటుంది” అనే డైలాగ్ ద్వారా, ఆ పాత్ర కోపం ఎంత తీవ్రమైందో చూపించారు. ఇది నాని మాస్ అవతారం ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో చెప్పకనే చెప్పేస్తుంది.

ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ విమర్శకులు ఈ సినిమాతో నాని తన కెరీర్‌లో మరో ఘన విజయాన్ని అందుకుంటాడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ది ప్యారడైజ్ విడుదలైన తర్వాత నాని ఎంత పెద్ద హిట్ కొడతాడో చూడాలి.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments