
దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందించే తన కొత్త చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్‌ను ఇచ్చారు. వినోదభరిత చిత్రాలకు ప్రత్యేకంగా పేరొందిన అనిల్ రావిపూడి, ఈసారి కూడా కామెడీ, ఎమోషన్, యాక్షన్ మేళవించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి ఇప్పటి వరకు చేయని కొత్త పాత్రలో కనిపించనున్నారు. విశేషంగా, ఈ సినిమాలో చిరు తన అసలు పేరు అయిన శివశంకర వరప్రసాద్ పేరుతోనే నటించనున్నారు.
ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తవడంతో, అనిల్ రావిపూడి చిరంజీవికి ఫైనల్ నేరేషన్ ఇచ్చారు. కథ విన్న చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో చిత్రబృందం త్వరలోనే షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “స్క్రిప్ట్ వినిపించడం పూర్తయింది… చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నా కథలో శంకర్ వరప్రసాద్ పాత్రను చిరంజీవిగారికి పరిచయం చేశాను. ఆయనకు ఆ రోల్ చాలా నచ్చింది. ఇక ఆలస్యం ఎందుకు… మంచి ముహూర్తంలో చిరు నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం” అంటూ పోస్ట్ చేశారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్నారు. చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారని సమాచారం. వీరిలో ఒకరు ప్రముఖ హీరోయిన్ కాగా, మరొకరు కొత్తముఖం కావొచ్చని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.
అనిల్ రావిపూడి గతంలో తెరకెక్కించిన సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి గత సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెప్పించేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది.