
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి సీజన్‌కి ఆడియెన్స్ నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ప్రారంభ దశలో బిగ్‌బాస్‌ను విమర్శించినవారు కూడా చివరికి షోను ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు తొమ్మిదవ సీజన్‌కు సన్నాహాలు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ప్రోమో ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తోంది.
గురువారం అనూహ్యంగా విడుదలైన ప్రోమోలో హోస్ట్ నాగార్జున ఎప్పటిలానే స్టైలిష్ లుక్‌లో మెరిశారు. ఈసారి బిగ్‌బాస్ సీజన్ పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని ఆయన స్పష్టం చేశారు. “అలుపు వచ్చినంత తొందరగా గెలుపు రాదు… యుద్ధం చేస్తే సరిపోదు, ప్రభంజనం సృష్టించాలి” అని నాగార్జున చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అవుతోంది. ఇది బిగ్‌బాస్ 9 సీజన్ మరింత గట్టిగా, ఆసక్తికరంగా సాగుతుందని సంకేతాలు ఇస్తోంది.
ఈసారి ‘చదరంగం కాదు – రణరంగమే’ అనే ట్యాగ్‌లైన్‌తో షో ప్రారంభంకాబోతుంది. ఇందులో పోటీదారుల మధ్య మామూలు గేమ్స్ కాకుండా పూర్తి స్థాయిలో మానసిక, భావోద్వేగ టాస్క్‌లు ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. రియాలిటీ టీవీ షోలలో టాప్ ప్లేస్‌లో ఉన్న బిగ్‌బాస్, ఈ కొత్త దిశలో ప్రయాణించి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఫ్యాన్స్ దీన్ని విపరీతంగా షేర్ చేస్తూ, షోపై తమ అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్ అభిమానులకు ఇది నిజంగా సర్‌ప్రైజ్. సెప్టెంబర్‌లో షో ప్రసారం మొదలయ్యే అవకాశమున్నా, మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
మొత్తానికి, బిగ్‌బాస్ 9 సీజన్ పైన ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొత్త రూల్స్, ఆసక్తికర టాస్క్‌లతో ఈ సీజన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సిందే.


