spot_img
spot_img
HomePolitical NewsNationalటీమిండియాకు శుభవార్త, స్టార్ ఫిట్.

టీమిండియాకు శుభవార్త, స్టార్ ఫిట్.

టీ20 ప్రపంచ కప్‌ 2026కు ముందు టీమిండియా అభిమానులకు భారీ శుభవార్త అందుతోంది. అనూహ్యంగా సర్జరీ కారణంగా జట్టుకు దూరమైన యువ స్టార్ తిలక్ వర్మ త్వరలోనే పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్‌తో జరిగే చివరి టీ20 నాటికి అతడు పూర్తిగా కోలుకుంటాడని వార్తలు వస్తుండటంతో, వరల్డ్ కప్‌కు అతడి అందుబాటుపై ఆశలు మరింత పెరిగాయి. తిలక్ వర్మ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడం టీమిండియాకు పెద్ద ప్లస్‌గా మారనుంది.

ప్రస్తుతం టీమిండియా మేనేజ్‌మెంట్ తిలక్ వర్మను న్యూజిలాండ్‌తో చివరి టీ20లో ఆడించాలా? లేక నేరుగా ప్రపంచ కప్‌కు సిద్ధం చేయాలా? అనే అంశంపై ఆలోచిస్తోంది. అతడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, తొందరపడి మ్యాచ్‌లకు దించకుండా పూర్తిగా రికవరీ అయ్యాకే అవకాశమివ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం తిలక్ వర్మ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కఠినమైన ఫిట్‌నెస్, బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడు.

ఈ పరిస్థితుల్లో వరుసగా మూడు టీ20ల్లో విఫలమైన సంజు శాంసన్‌కు మరో అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇషాన్ కిషన్ నుంచి సంజూకు గట్టి పోటీ ఉంది. ఆసియా కప్‌లో సంజూ చూపిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పట్లో అతడిని పక్కన పెట్టే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ తిలక్ వర్మ తిరిగి జట్టులోకి వస్తే, మిడిల్ ఆర్డర్‌లో మార్పులు తప్పవని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో గాయపడిన వాషింగ్టన్ సుందర్ పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. పక్కటెముకల గాయంతో అతడు రెండు వన్డేలు, టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. వైద్యుల సూచన మేరకు మరో రెండు వారాల విశ్రాంతి అవసరమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

టీ20 ప్రపంచ కప్‌ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుండటంతో, జట్టు ఎంపికపై సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. తిలక్ వర్మ ఫిట్‌గా మారడం టీమిండియాకు పెద్ద బలంగా మారనుండగా, వాషింగ్టన్ సుందర్ పరిస్థితిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా ప్రపంచ కప్‌కు ముందు టీమిండియా శిబిరంలో ఆశలు, అంచనాలు మరింత పెరిగాయి.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments